తెలంగాణ ప్రముఖులు
తెలంగాణ ప్రముఖులు
- హైదరాబాదు సంఘసంస్కర్తగా పేరుపొందిన భాగ్యరెడ్డివర్మ,
- తొలి తెలుగు రామాయణం రంగనాథ రామాయణం రచించిన గోన బుద్దారెడ్డి,
- సహజకవి బమ్మెరపోతన,
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత పైడి జైరాజ్,
- ప్రముఖ కవి, విమోచనోద్యమకారుడు దాశరథి రంగాచార్యులు,
- కవయిత్రి సరోజినీ నాయుడు,
- కవి పండితుడు వానమామలై వరదాచార్యులు,
- ఒగ్గు కథకు అంతర్జాతీయ ఖ్యాతి తెచ్చిన మిద్దె రాములు,
- ప్రముఖ విమోచనోద్యమకారుడు, నిజాంపైబాంబులు విసిరిన నారాయణరావు పవార్,
- ప్రముఖ చిత్రకళాకారుడు కొండపల్లి శేషగిరి రావు,
- ప్రముఖ తెలంగాణవాది, మాజీ మంత్రి కొండా లక్ష్మణ్ బాపూజీ,
- ప్రముఖ సాహితీవేత్త జువ్వాడి గౌతంరావు,
- సుమతీ శతక కర్త బద్దెన,
- తొలి తెలుగు పురాణ అనువాదకుడు, మార్కండేయ పురాణం రచించిన మారన, భూమి కోసం, భుక్తి కోసం సాయుధపోరాటం చేసిన దొడ్డి కొమరయ్య,
- ప్రముఖ సాహితీవేత్త దేవులపల్లి రామానుజరావు,
- తెలంగాణ కాటన్‌గా ప్రసిద్ధి చెందిన నవాబ్ అలీ నవాబ్‌జంగ్ బహదూర్,
- ప్రధానమంత్రిగా పనిచేసిన పి.వి.నరసింహరావు,
- ప్రముఖ సంకీర్తనాచార్యుడు ముష్టిపల్లి వేంకటభూపాలుడు,
- ప్రముఖ విద్యావేత్త చుక్కా రామయ్య,
- ప్రతిజ్ఞ రచయిత పైడిమర్రి సుబ్బారావు,
- నిజాం కాలంలో కొత్వాల్‌గా పనిచేసిన రాజా బహదూర్ వెంకటరామిరెడ్డి,
- సాయుధపోరాట యోధుడు ఆరుట్ల రామచంద్రారెడ్డి,
- ప్రముఖకవి వేములవాడ భీమకవి,
- సమరయోధుడు రాధాకిషన్ మోదాని,
- జానపద సాహిత్య సృష్టికర్త బిరుదురాజు రామరాజు,
- తెలంగాణ సాహితీమూర్తి లక్ష్మీ నరసింహశర్మ,
- ప్రముఖ సమరయోధుడు పులిజాల వెంకటరంగారావు,
- 13వ శతాబ్దికి చెందిన శివకవి పాల్కురికి సోమనాథుడు,
- కమ్యూనిస్ట్ నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షం,
- తెలంగాణ సాయుధ పోరాట సేనాని రాజ్ బహదూర్ గౌర్,
- నిజాంపై తిరగబడిన షోబుల్లాఖాన్,
- గద్వాల కోటను నిర్మించిన పెద సోమభూపాలుడు,
- సమరయోధుడు జమలాపురం కేశవరావు,
- ప్రముఖ చిత్రకారుడు పాకాల తిరుమల రెడ్డి,
- ప్రముఖ కవి సామల సదాశివ,
- సాహితీ వేత్త కూరెళ్ల విఠలాచార్య,
- సమరయోధుడు, సంఘసంస్కర్త పల్లెర్ల హనుమంతరావు,
- ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి ఒక రూపు తీసుకువచ్చిన కొత్తపల్లి జయశంకర్,
- అడవి బిడ్డలకు అండగానిలిచిన రాంజీ గోండు,
- కుతుబ్‌షాహీల నాటి కవి మరింగంటి సింగనాచార్యులు,
- తెలంగాణ ఉద్యమకారిణి టి.ఎస్.సదాలక్ష్మి,
- తొలితరం తెలుగు కవి కొరవి గోపరాజు,
- నటుడు కత్తి కాంతారావు,
- విమోచనోద్యమకారుడు విశ్వనాథ్ సూరి,
- దక్షిణ భారతదేశంలోనే తొలి మహిళాపాలకురాలు రుద్రమదేవి,
- హైదరాబాదు రాష్ట్రానికి ఎన్నికైన తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు
- ముఖ్యమంత్రిగా పనిచేసిన టంగుటూరి అంజయ్య,
- సాహితీవేత్త కృష్ణస్వామి ముదియార్,
- తెలంగాణభాషలో కవితలద్దిన కాళోజీ నారాయణరావు,
- కవి మల్లినాథ సూరి,
- ప్రముఖ చిత్రకారుడు కాపు రాజయ్య,
- కవి, కళాకారుడు సుద్దాల హనుమంతు,
- బహుముఖ ప్రజ్ఞాశాలి వట్టికోట ఆళ్వారుస్వామి,
- తెలంగాణ రైతాంగపోరాటయోధుడు బందగి,
- ప్రముఖ కమ్యూనిస్ట్ నాయకుడు రావి నారాయణరెడ్డి,
- ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన బూర్గుల రామకృష్ణారావు,
- సమరయోధుడు మందుముల నరసింగరావు,
- కళాకారుడు, కవి పల్లెర్ల రామ్మోహనరావు,
- గవర్నరుగా పనిచేసిన బి.సత్యనారాయణ రెడ్డి,
- తెలంగాణలో కవులే లేరని హేళన చేయగా "గోల్కొండకవుల చరిత్ర"తో నోరుమూయించిన సురవరం ప్రతాపరెడ్డి,
- ప్రముఖ కవి మరియు చరిత్ర పరిశోధకుడు కపిలవాయి లింగమూర్తి,
- తొలితెలుగు కవయిత్రి కుప్పాంబిక,
- ప్రముఖ చరిత్ర పరిశోధకుడు, సాహితీవేత్త గడియారం రామకృష్ణ శర్మ,
- తెలంగాణ ఉద్యమనేత బొజ్జం నరసింహులు,
- నిజాం పాలనను ఎదిరించి ప్రజలలో చైతన్యం తెచ్చిన అనభేరి ప్రభాకరరావు,
- 15వ శతాబ్దికి చెందిన ప్రముఖ కవి చరిగొండ ధర్మన్న,
- మొఘల్ పాలనను అడ్డుకున్న సర్వాయి పాపన్న,
- కూచిపూడి నృత్యంలో అంతర్జాతీయ ఖ్యాతిచెందిన రాజారాధారెడ్డి దంపతులు,
- ఆర్యసమాజ్ ప్రముఖుడు పండిత్ నరేంద్రజీ,
- విమోచనోద్యమకారుడు పాగ పుల్లారెడ్డి,
- నిజాంపై తిరగబడిన ఆదివాసి కొమురం భీమ్,
- ముఖ్యమంత్రిగా పనిచేసిన జలగం వెంగళరావు,
- తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుడు కె.చంద్రశేఖర రావు,
- ముఖ్యమంత్రిగా, గవర్నరుగా పనిచేసిన మర్రి చెన్నారెడ్డి,
- కథా రచయిత అల్లం రాజయ్య, ప్రముఖ వాగ్గేయకారుడు రాకమచర్ల వేంకటదాసు,
- తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన కోదండరాం,
- విమోచనొద్యమకారుడు వెల్దుర్తి మాణిక్యరావు,
- ప్రముఖ విద్యావేత్త జి.రాంరెడ్డి,
- ప్రముఖ చిత్రకారుడు తోట వైకుంఠం,
- శాసనసభ స్పీకరుగా పనిచేసిన దుద్దిల్ల శ్రీపాద రావు,
- చేనేత వస్త్ర పరిశోధకుడు నల్ల పరంధాములు,
- ప్రముఖ సాహితీవేత్త, జ్ఞాన్‌పీఠ్ అవార్డు గ్రహీత సి.నారాయణ రెడ్డి,
- కేంద్రమంత్రిగా పనిచేసి, ప్రస్తుతం మహారాష్ట్ర గవర్నరుగా ఉన్న సి.హెచ్.విద్యాసాగర్ రావు,
- ప్రముఖ చరిత్ర పరిశొధకుడు ఆదిరాజు వీరభద్రరావు,
- విమోచనోద్యమకారిణి ఆరుట్ల కమలాదేవి,
- విప్లవకవి గద్దర్,
- ప్రముఖ రచయిత జ్వాలాముఖి,
- విమోచనొద్యమకారుడు మగ్దూం మొహియుద్దీన్,
- మాజీ ఉప ముఖ్యమంత్రి, తెలంగాణ పితామహుడిగా పేరుపొందిన కొండా వెంకట రంగారెడ్డి, ఈ ప్రాంతానికి చెందిన ప్రముఖులలో కొందరు.
No comments:
Post a Comment