తెలంగాణ జిల్లాలు:
తెలంగాణా రాష్ట్రంలో
ఖమ్మం,మహబూబ్ నగర్,
నల్గొండ,
రంగారెడ్డి,
వరంగల్,
కరీంనగర్,
నిజామాబాదు,
అదిలాబాదు,
మెదక్ ,
హైదరాబాదు అనే 10 జిల్లాలు కలవు. 1948లో హైదరాబాదు రాష్ట్రం ఏర్పడే నాటికి 8 జిల్లాలు ఉండగా, 1956లో ఖమ్మం జిల్లా, ఆంధ్రప్రదేశ్‌లో భాగంగా ఉన్నప్పుడు 1978లో రంగారెడ్డి జిల్లా నూతనంగా ఏర్పాటు చేశారు.
ఈ రాష్ట్రంలో ఆదిలాబాదు జిల్లా ఉత్తరాన ఉండగా పశ్చిమ సరిహద్దులో ఆదిలాబాదుతో పాటు నిజామాబాదు, మెదక్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలు ఉన్నవి. ఈశాన్య సరిహద్దులో కరీంనగర్, వరంగల్ మరియు ఖమ్మం జిల్లాలు ఉన్నాయి. దక్షిణమున మహబూబ్ నగర్ జిల్లా, ఆగ్నేయమున నల్గొండ జిల్లా సరిహద్దుగా ఉంది. ఖమ్మం జిల్లా తెలంగాణకు అతి తూర్పున ఉన్న జిల్లాగా పేరుగాంచింది. తెలంగాణ రాష్ట్రపు భౌగోళిక సరిహద్దు లేని ఏకైక జిల్లా హైదరాబాదు.
కర్ణాటక సరిహద్దుగా 3 జిల్లాలు, మహారాష్ట్ర సరిహద్దుగా 3 జిల్లాలు, ఛత్తీస్‌ఘఢ్ సరిహద్దుగా 2 జిల్లాలు, ఆంధ్రప్రదేశ్ సరిహద్దుగా 3 జిల్లాలు ఉన్నవి.
No comments:
Post a Comment