తెలంగాణ సంస్కృతి
పండుగలు:
బోనాల ఉత్సవాలు మరియు బతుకమ్మ ఉత్సవాలు తెలంగాణ యొక్క ప్రత్యేకతలుగా చెప్పవచ్చు. ఇవి కాకుండా మిగితా తెలుగు ప్రజలు జరుపుకొనే సంక్రాంతి, ఉగాది, దసరా, వినాయక చవితి, రంజాన్ తదితర ముఖ్య పండుగులను ఇక్కడి ప్రజలు భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారు. జూన్ 26, 2014న తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం బోనాలును రాష్ట్ర పండుగగా గుర్తిస్తూ ఉత్తర్వు జారీచేసింది.
భాష:
తెలంగాణ రాష్ట్రంలో అధిక సంఖ్యాకుల భాష తెలుగు. సంపూర్ణ తెలంగాణావారు మాట్లాడే తెలుగు భాషలో ఉర్దూ పదాలు ఎక్కువగా కలుస్తాయి. ఆదిలాబాదు జిల్లాకు మూడు వైపులా మహారాష్ట్ర సరిహద్దు ఉండటంతో ఆ జిల్లాలో మరాఠి భాష ప్రభావం కొంత ఉంది. మహబూబ్‌నగర్, మెదక్, నిజామాబాదు జిల్లాల కర్ణాటక సరిహద్దు గ్రామాలలో కన్నడ భాష ప్రభావం కొంతవరకు కనిపిస్తుంది. తెలంగాణ ప్రాంతపు గ్రామీణ తెలుగు భాష యాసలో మిగితా ప్రాంతపు తెలుగు భాషకు కొద్దిగా వైరుధ్యం కనిపిస్తుంది. తెలంగాణాలోని ఆంధ్ర ప్రదేశ్ సరిహద్దుల్లో కొద్దిగా స్వచ్చమైన తెలుగు వినిపిస్తుంది.
వస్త్రధారణ:
తెలంగాణ ప్రాంతము ఉత్తర-దక్షిణ భారతదేశానికి వారధిగా ఉండటం మరియుకొన్ని శతాబ్దాల నుంచి ఈ ప్రాంతంపై దండయాత్రలుచేసి పాలించడం, ఇతర ప్రాంతాల వారు వచ్చి నివాసం ఏర్పర్చుకోవడంతో ఇక్కడ మిశ్రమ వస్త్రధారణ ఉంది. అలాగే మారుతున్న ధోరణులు, సినిమా-అంతర్జాలం-అంతర్జాతీయీకరణ తదితరాల వల్ల కూడా ఇక్కడి వస్త్రధారణ పట్టణ ప్రాంతాలలో చాలా మార్పుచెందింది. అయిననూ తెలంగాణ గ్రామీణ ప్రాంతాలలో పురుషులు మోకాళ్లపైకి ఉండే ధోవతి, మహిళలు చీరలు ధరించడం సాధారణంగా కనిపిస్తుంది. గిరిజన ప్రాంతాల మహిళలు మాత్రం వారి సంప్రదాయక దుస్తులు ధరిస్తారు.

No comments:
Post a Comment