నిరంకుశ నిజాం వ్యతిరేకోద్యమంలో ఎందరో కవులు, రచయితలు ప్రముఖపాత్ర వహించారు. వారు తమ కవితలు, రచనల ద్వారా ప్రజలలో జాగృతిని కల్పించడమే కాకుండా స్వయంగా ఉద్యమాలలో పాల్గొని జైలుకు వెళ్ళారు. దాశరథి లాంతి వారు కారాగారంలోనే ఉంటూ గోడలపై బొగ్గుతో నిజాం వ్యతిరేక కవితలు రాశారు, ప్రజాకవి కాళోజీ లాంటివారు స్థానిక ప్రజలకు అర్థమయ్యే విధంగా ఉర్రూతలూగించే కవితలు జనంలోకి తీసుకువెళ్ళారు.
నిజామనగ ఎంతరా ... వాడి తహతెంతరా...
అంతగలసి తంతె మల్ల వాడి అంతులేదురా.......
నవయుగంబున నాజీ నగ్ననృత్యమింకెన్నాళ్ళు ......
హింసపాపమని యెంచు దేశమున హిట్లరిత్వమింకెన్నాళ్ళు. (కాళోజి)
మన కొంపలార్చిన , మన స్త్రీల చెరిచిన ........
కండకండలుగా కోసి కాకులకు వేయాలె, కాలంబు రాగానె కాటేసి తీరాలె (కాళోజి)
నైజాము సర్కరోడా, నాజీలను మించినోడా.......
గోల్కొండ ఖిల్లా కింద నీ ఘోరి కడతాం కొడుకా నైజాము సర్కరోడా (యాదగిరి)
ఓ నిజాము పిశాచమా కానరాడు నినుబోలిన రాజు మాకెన్నెడేని .......
నా తెలంగాణ కోటి రతనాల వీణ (దాశరథి)
నిన్ను గెలవాలేక రైతన్నా......
నిజాం కూలింది కూలన్న (దాశరథి)
ఈ భూమి నీదిరా, ఈ నిజాం ఎవడురా!
ఈ జులుమీ జబర్ దస్తీ, వెగురదన్నీ వేయరా! (సుద్దాల హనుమంతు)
ఖాసింరజ్వీ ఎంతరా, వాడి బిసాదెంతరా?
అందరం కలిసి తంతే, అంతు దొరక కుందురా! (కొండేపూడి లక్ష్మీనారాయణ)
పాలన పేరుతో పల్లెపల్లెలో జరిగిన పాపము చాలింక
రక్షణ కై ఏర్పడిన బలగమే చేసే భక్షణ చాలింక (కాళోజి)

No comments:
Post a Comment